in ,

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం

TDP won against YSRCP

హోరా హోరీగా సాగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. కడపలో నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఫలితాలలో చిట్ట చివరకు ఆస్థానం తెలుగు తమ్ముళ్లు ఖాయం చేసుకున్నారు. ఈ విజయంతో రాష్ట్రంలోని పలు చోట్ల టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కడపలో వైసీపీ అభ్యర్ధి వైఎస్ వివేకానందరెడ్డిపై 33ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం సొంతం చేసుకున్నారు. నెల్లూరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి విజయం సాధించారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థి గెలుపు ఖరారైంది. 87 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై నారాయణ రెడ్డి గెలుపొందారు. అలాగే కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు. 56 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై శిల్పా చక్రపాణి విజయం సాధించారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Mohan babu- YS jagan - Manchu lakshmi

మా పాపకు టికెట్ ఇస్తావా ఇవ్వవా: జగన్ తో మోహన్ బాబు

xiaomi Redmi 4A smartphone

షియోమీ రెడ్‌‌మీ 4ఎ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5999 మాత్రమే