in

కన్నీటితో సారీ చెబుతూ ఫేస్‌బుక్‌లో వీడియో పెట్టిన హీరోయిన్

Anna Rajan

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిపై చీఫ్ కామెంట్స్ చేసి అభిమానులు ఆగ్రహానికి గురైంది హీరోయిన్ అన్నా రాజన్‌. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా హీరోయిన్ అన్నా రాజన్ ఓ టివి చానలో లో స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ..మమ్ముట్టిపై కొన్ని చీఫ్ కామెంట్స్ చేసింది. దీంతో స్టార్‌ హీరో ఫ్యాన్స్‌ ఆమెను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో కన్నీటితో సారీ చెబుతూ ఫేస్‌బుక్‌లో వీడియో సందేశాన్ని అందించింది.

వివరాల్లోకి వెళ్తే .. మమ్మూటి, ఆయన తనయుడు సల్మాన్‌ దుల్కర్‌లలో అవకాశం వస్తే ఎవరికి జోడీగా నటిస్తారని ఓ టీవీ షో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్‌ను యాంకర్‌ ప్రశ్నించింది. దానికి సమాధానంగా దుల్కర్‌తో నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు వెటకారంగా మాట్లాడింది. దీంతో మమ్ముట్టి ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చి అన్నా రాజన్‌ నే కాదు ఆమె తండ్రిని సైతం వదలకుండా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో తీవ్ర పోస్టులు పెట్టేశారు. దీంతో దిగొచ్చిన అన్నా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది.

ఈ సందర్భంగా అన్నా రాజన్ మాట్లాడుతూ..వాస్తవానికి ‘మమ్మూటీ సర్‌ను కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్లు చేయలేదు. దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ.. దుల్కర్‌కు తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు, మమ్మూటీతో కూడా జోడీగా నటించాలని నేను చెప్పాను. తనని అందరూ క్షమించాలని ఆమె మమ్మూటీ అభిమానులను వేడుకుంది.

Loading...

What do you think?

-1 points
Upvote Downvote

Total votes: 1

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 1

Downvotes percentage: 100.000000%

jai lava kusa in rs 100 crore club

రూ. 100 క్లబ్ లో జై లవకుశ

Police jobs DGP Anurag Sharma

పోలీసు శాఖలో త్వరలో 26 వేల పోస్టుల భర్తీకి సిద్ధం