in

ఎయిర్‌టెల్ మరో కొత్త 4జీ ఫోన్ రూ.1649కే

Airtel 4G Phone - Intex

ఇంటెక్స్ కంపెనీతో భాగస్వామ్యమైన ఎయిర్‌టెల్ ఆక్వా లయన్స్ ఎన్1 పేరిట మరో కొత్త 4జీ ఫోన్‌ను కేవలం రూ.1649కే అందిస్తున్నది. అయితే ఈ ఫోన్‌కు గాను వినియోగదారులు ముందుగా రూ.3,149 డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఫోన్‌ను 18 నెలల పాటు వాడితే రూ.500, 36 నెలలు వాడితే రూ.1000 మొత్తం కలిపి రూ.1500 వెనక్కి ఇస్తారు. దీంతో ఫోన్ ధర రూ.1649 మాత్రమే అవుతుంది. ఇక ఈ ఫోన్‌తో ఎయిర్‌టెల్ రూ.169 బండిల్ ప్లాన్‌ను అందిస్తున్నది. దీని ద్వారా వినియోగదారులకు 500 ఎంబీ 4జీ డేటా, 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఇక ఈ ఫోన్‌తోపాటు ఎయిర్‌టెల్ ఇంటెక్స్‌తో కలసి మరో రెండు ఫోన్లను కూడా తాజాగా విడుదల చేసింది.

ఇంటెక్స్ ఆక్వా ఎ4, ఆక్వా ఎస్3 ఫోన్లు రూ.1,999, రూ.4,379 ధరలకు లభ్యమవుతున్నాయి. ఈ ఫోన్లను కూడా 36 నెలల పాటు వాడితే రూ.1500 వెనక్కి ఇచ్చేస్తారు. అయితే ఇంటెక్స్ ఆక్వా ఎ4 ఫోన్‌కు గాను ముందుగా రూ.3,499, ఆక్వా ఎస్3 ఫోన్‌కు గాను ముందుగా రూ.5,879 డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఫోన్లకు కూడా ఎయిర్‌టెల్ రూ.169 బండిల్ ప్లాన్‌ను అందిస్తున్నది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

prabhas baahubali 2

మొదటి స్థానంలో బాహుబలి 2

mahesh kathi fires on pawan kalyan, pawan fans

పవన్, చిరంజీవిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్