in

అజ్ఞాతవాసి మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందో తెలుసా..!

Agnyaathavaasi MOVIE REVIEW, STORY, TALK
Agnyaathavaasi MOVIE REVIEW, STORY, TALK

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ లాంటి చిత్రాల తరువాత భారీ అంచనాలతో వస్తున్నచిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్‌, బోమన్ ఇరానీ, ఆది పినిశెట్టి, ఖుష్బూ, రావు రమేష్‌, మురళీశర్మ, ప్రరాగ్ త్యాగి, వెన్నెల కిషోర్‌, అజయ్, తనికెళ్ల భరణి, రఘుబాబు తదితరులు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు. సంగీతం అనిరుధ్‌ అందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో అదరగొట్టిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఎలా ఉందో అసలు కథ ఏమిటో చూద్దాం..

కథ విషయానికి వస్తే … బొమన్ ఇరానీ (గోవింద్ భార్గవ్ అలియాస్ విందా) ప్రముఖ వ్యాపార వేత్త. ఏబీ సంస్థలకు అధిపతి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విందాని, అతని తనయుడిని వ్యాపార లావాదేవీలు కారణంగా చంపేస్తారు. దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) కంపెనీ వ్యవహారాలు పర్యవేక్షణ కోసం బాలసుబ్రమణ్యం(పవన్ కల్యాణ్‌)ని మేనేజర్‌గా నియమిస్తారు. అస్సాం నుండి వచ్చిన బాలసుబ్రమణ్యం మేనేజర్‌గా వ్యవహారాలు చేసుకుంటేనే.. విందా హత్యకు కారకులెవరనే దానిపై ఆరా తీస్తుంటాడు. ఇంతకు విందాను హత్య చేసిందెవరు? అసలు బాలసుబ్రమణ్యమెవరు? అస్సాం నుండి ఏబీ మేనేజర్‌గా రావడానికి కారణాలేంటి? బాలసుబ్రమణ్యం, అభివ్యక్త భార్గవకు ఉన్న రిలేషన్ ఏంటి? సీతారామ్‌(ఆదిపినిశెట్టి) ఎవరు తనకి, విందాకు ఉన్న లింకేంటి? అనే విషయాలు వెండితెరపై చూడాల్సిందే.

పవన్ కళ్యాణ్ తన మార్క్ నటనను కనపరిచాడు. బాలసుబ్రహ్మణ్యం, అభిషిక్త భార్గవగా అభిమానులను ఆకట్టుకున్నాడు. పంచ్ డైలాగ్స్ అదరగొట్టాడు. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర ఖుష్బూ.. ఇంద్రాణి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. స్టాలిన్ తర్వాత మరోసారి తెలుగులో మంచి పాత్రలో కనపడింది ఖుష్బూ. క్లైమాక్స్‌లో ఖుష్బూ నటన మెప్పిస్తుంది. ఇక సినిమాలో భాగమైన కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ పాత్రలు గ్లామర్‌కే పరిమితమయ్యాయి. ఆది పినిశెట్టి ఈ చిత్రంలోనూ తన మార్క్ విలనిజాన్ని చూపాడు. మురళీశర్మ, రావు రమేష్ పాత్రలు కామెడీకి పరిమితం. మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే.. బేసిక్‌గా రచయిత అయిన త్రివిక్రమ్ తనదైన డైలాగ్స్‌తో తన మార్కును చూపించారు. ఇక ఈ సినిమా ద్వారా తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ తనదైన స్టైల్లో మంచి సంగీతాన్ని అందించాడు.

పవన్ – త్రివిక్రమ్ సినిమాలకు టెక్నికల్ గా వంక పెట్టలేం. ఐతే, సినిమాలో త్రివిక్రమ్ లోని దర్శకుడి కంటే రచయితకే ఎక్కువ మార్కులు పడ్డాయి. త్రివిక్రమ్ డైలాగ్స్ లో కొన్ని మనతో పాటు ఇంటికి కూడా వస్తాయి. పవన్ తో పాడిచ్చిన కొడకా కోటీశ్వర సాంగ్ అదిరిపోయింది. పవన్ ఎంట్రీ సీన్ భలే ప్లాన్ చేశారు. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ ఓకే. ఐతే, సినిమా అత్తారింటికి దారేది సీన్స్ ని గుర్తు తెచ్చేలా సాగిందని అనిపించింది.

మొత్తానికి అజ్ఞాతవాసి చిత్రం పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకోవచ్చు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

TS Transco junior Lineman jobs

టీఎస్‌ ట్రాన్స్‌కోలో జూనియర్‌ లైన్‌మెన్ల ఉద్యోగాలు

actress Trisha hot selfie image

సినీనటి త్రిషాపై నిర్మాత ఫిర్యాదు