in

దీపావళికి సిమ్రన్‌ సందేశం, ప్రతి ఒక్కరు పాటిద్దాం

Simran Diwali Wishes with a Special Message

దీపావళి సందర్భంగా ప్రముఖ నటి సిమ్రన్‌ అభిమానులకు సందేశాత్మకమైన శుభాకాంక్షలు తెలిపారు. ‘సిమ్రన్‌ అండ్‌ సన్స్‌ ఫిలింస్‌’ పేరిటతమిళం, ఆంగ్లంలో ఓ వీడియో రూపొందించారు.

వీడియోలో సిమ్రన్‌ మాట్లాడుతూ.. ‘కొందరి ఆనందం మరొకరికి బాధ కలిగించొచ్చు. ఒకరి మరణం మరొకరికి జీవం పోస్తుంది. ఒకరికి వృథా అనిపించేది మరొకరికి విలువైనది అవుతుంది. ఒకరి ఆహారమే మరొకరికి విషం కావచ్చు. ఒకరికి శబ్ధం అనిపించేది మరొకరికి సంగీతం అవుతుంది. మనం ఉండే వీధుల్లో ఇళ్లు, సైకిళ్లు, కార్లు, బైకులు, పిల్లులు, కుక్కలు తిరుగుతుంటాయి. రోడ్లపై కొందరు నడుస్తుంటారు, తింటుంటారు, నిద్రిస్తుంటారు. బాణసంచాలను రోడ్లపై కాలిస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. జంతువులు భయపడతాయి.

కాబట్టి బాణసంచా కాల్చాలనుకుంటే ఇతరులకు నష్టం వాటిల్లకుండా వాటిని ఖాళీ ప్రదేశాలకు తీసుకెళ్లి సెలబ్రేట్‌ చేసుకుందాం. ఈ దీపావళిని మానవత్వంతో జరుపుకొందాం. అప్పుడు మనకు సంతోషాన్ని కలిగించేది చాలా మందికి ఆనందాన్ని ఇస్తుంది. దీపావళి శుభాకాంక్షలు’ అని సిమ్రన్‌ పేర్కొన్నారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

hardik pandya birthday celebrations

అందరిపైనా ప్రతీకారం తీర్చుకుంటా: హార్దిక్‌ పాండ్యా

adah sharma look in airport

కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్న ఆదాశర్మ