in

అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే సినిమా కష్టాలు

Arjun Reddy heroine shalini pandey

విజయ్ దేవెరకొండ మరియు శాలిని పాండే నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాను యువతరం ఇప్పుడు పిచ్చిగా చూసేస్తోంది. అర్జున్ రెడ్డి ఇప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ శాలిని పాండే పడిన కష్టాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.

శాలిని పాండే మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్ అనే ఒక చిన్న సిటీకి చెందిన అమ్మాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి. తనకు చిన్నతనం నుండే హీరోయిన్ కావాలనే ఆశ ఉండేదని, ఆ ఆసక్తితోనే ఇంట్లో వాళ్లను ఒప్పించి థియేటర్ ఆర్ట్స్‌లో చేరినట్లు శాలిని పాండే వెల్లడించారు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత యాక్టింగ్ వైపు వెళతానంటే నాన్న ఒప్పుకోలేదు. ఐటీ జాబ్‌లో జాయిన్ అవ్వమని ఫోర్స్ చేశారు. అపుడు నా కల నెరవేర్చుకోవడానికి ఎలాగైనా ఇంట్లో నుండి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాను అని శాలిని తెలిపారు. అలా ముంబైకి వచ్చిన తరువాత నాన్న నాకోసం రోజు ఫోన్ చేసి మర్యాదగా రావాలని ఫోర్సు చేసారు. దాంతో నేను రానని చెప్పేసాను. ఇంట్లో వాళ్లకి అలా తెగేసి చెప్పి ముంబైలో ఉండిపోయాను. నా దగ్గర అపుడు అకౌంట్లో కొంత డబ్బు మాత్రమే ఉంది. దేవుడి దయ వల్ల ముంబైలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ముంబైలో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. ఒక్కో గదిలో చాలా మంది ఇరుకుగా ఉండాల్సి వచ్చేది. డబ్బు సేవ్ చేయడానికి నడిచి వెళ్లడం, ఒక్కోసారి డిన్నర్ స్కిప్ చేయడం లాంటివిని చేసేదాన్ని అని శాలిని తెలిపారు.

ఇరుకు గదుల్లో ఉండటం ఇష్టం లేక నా స్నేహితురాలికి తెలిసిన ఇద్దరు అబ్బాయిలతో ఉండటానికి సిద్ధమయ్యాను. అప్పటికి ‘అర్జున్ రెడ్డి’ సినిమా సైన్ చేశాను. షూటింగ్ మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది. 15 రోజులు అని చెప్పి పరిచయం లేని ఇద్దరు అబ్బాయిలతో 2 నెలలు ఒకే ఇంట్లో ఉన్నాను. వారు చాలా మంచి వారు. నా విషయంలో ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు. నన్ను ఒక కిడ్ లా, ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు అని శాలిని తెలిపారు.

ఆడిషన్ సమయంలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని సందీప్ నాకు ముందు చెప్పలేదు. ఒక వేళ చెప్పి ఉంటే అపుడు ఒప్పుకునే దాన్ని కాదేమో. కానీ అవి స్లీజీ ముద్దు సీన్లుకావు. సాధారణంగా ఉండే ముద్దు సీన్లు కాబట్టే చేయగలిగాను అని శాలిని తెలిపారు. అర్జున్ రెడ్డి సినిమా పూర్తయిన తర్వాత ప్రీమియర్ షోకు నాన్న వచ్చారు. సినిమా చూసిన తర్వాత ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. ఇపుడు ఇంట్లో అంతా హ్యాపీగా ఉన్నారు. నా కల నెరవేరినందుకు నేను కూడా హ్యాపీ.

What do you think?

-2 points
Upvote Downvote

Total votes: 4

Upvotes: 1

Upvotes percentage: 25.000000%

Downvotes: 3

Downvotes percentage: 75.000000%

pslv - c39 - Navigation satellite

ఖంగుతిన్న ఇస్రో శాస్త్రవేత్తలు, పీఎస్‌ఎల్వీ-సీ39 ప్రయోగం విఫలం

Kathi Mahesh - Jr NTR

కత్తి మహేష్ కి ఎన్టీఆర్ ఫోన్ కాల్, ఏమి చెప్పారంటే ..!